లేడీ ఇన్ బ్లాక్ లో వంటలక్క.. బుక్ పోజ్ అదిరింది!
on May 25, 2025

వంటలక్క ఒక బుక్ పట్టుకుని నిలబడిన పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. వంటలక్క అంటే తెలియని తెలుగు ఆడియన్స్ ఎవరూ లేరు. కార్తీక దీపం సీరియల్ హీరోయిన్.. అదేనండి ప్రేమీ విశ్వనాధ్. ఇప్పుడు కార్తీక దీపం 2 లో కూడా డాక్టర్ బాబుతో కలిసి నటిస్తోంది. అలాంటి వంటలక్క ఇప్పుడు ఒక కొత్త లుక్ లో ఆకర్షిస్తోంది. ఒక లైబ్రరీ స్టాండ్ ముందు లేడీ ఇన్ బ్లాక్ లో అందంగా మెరిసిపోతూ చేతిలో ఒక బుక్ పట్టుకుని దీర్ఘంగా చదివిస్తోంది. ఆ బుక్ ఏంటో తెలుసా "మై స్టోరీ బై కమల దాస్" . కమల దాస్ గారి ఆటో బయోగ్రఫీ బుక్ అది. ప్రేమి విశ్వనాధ్ బుక్ లవరో కాదో తెలీదు కానీ మంచి బుక్ చదువుతూ తన ఫాన్స్ ని నెటిజన్స్ మాత్రం ఆకర్షిస్తోంది.
ప్రపంచంలో చాలా విషయాలు తెలియాలి అంటే బయోగ్రఫీ రీడింగ్ వల్లనే సాధ్యం అని పెద్దలు అంటూ ఉంటారు. విడిగా కథలు చదవక్కర్లేదు.. ఒక్కొక్కరి బయోగ్రఫీ చదివితే అందులోనే ఎన్నో కథలు వచ్చేస్తాయి. ఇప్పుడు వంటలక్క కూడా అదే చేస్తోంది. ఈ పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంది. ఇక నెటిజన్స్ ఐతే వంటలక్క ఈ బుక్ పోజ్ ని మాత్రం తెగ వర్ణించేస్తూ ఎమోజీలతో రిప్లైస్ ఇస్తున్నారు.
సీరియల్ లో పొందిగ్గా కాటన్, సిల్క్ చీరల్లో కనిపించి అలరించే వంటలక్క మాములుగా తన ఓన్ లైఫ్ లో రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకుని కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అబ్బాయితో కలిసి రీల్స్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ బాబుతో కలిసి షూటింగ్స్ మధ్యలో అల్లరి చేస్తూ ఉంటుంది. ఏదేమైనా వంటలక్క మాత్రం తెలుగు ఆడియన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ని సంపాదించుకుంది. కార్తీక దీపం-1 2017 లో స్టార్ట్ అయ్యి 2023 లో సుమారు 1500 ఎపిసోడ్స్ కి పైగా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు కార్తీక దీపం 2 కూడా రేటింగ్స్ లో దూసుకెళుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



